Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ మూవీని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఫస్ట్ సింగిల్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుందట. మ్యూజిక్ ఆల్బమ్ నుంచి అభిమానులకు అషీషియల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం అధికారిక ప్రకటన ఏం లేకున్నా ఈ న్యూస్‌ను మాత్రం మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. కొన్ని పోర్షన్లు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు