Mem Famous | మేమ్ Famousను థియేటర్లో మిస్సయ్యారా..? అయితే గెట్ రెడీ
Mem Famous | డెబ్యూ యాక్టర్లు సుమంత్ ప్రభాస్, సార్య కాంబోలో వచ్చిన చిత్రం మేమ్ Famous (Mem Famous). థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్ఫాంలోనే తన సత్తా చాటేందుకు రెడీ అయింది.
Mem Famous | డెబ్యూ యాక్టర్లు సుమంత్ ప్రభాస్, సార్య కాంబోలో వచ్చిన చిత్రం మేమ్ Famous (Mem Famous). విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీకి సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించాడు. మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్ఫాంలోనే తన సత్తా చాటేందుకు రెడీ అయింది.
మేమ్ Famous అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంకేంటి.. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసేయండి మరి. ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని తెరకెక్కించిన ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథతో మేమ్ Famous తెరకెక్కిన ఈ మూవీని టాప్ ప్రొడక్షన్ బ్యానర్ గీతా ఆర్ట్స్ పంపిణీ చేసింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి విడుదల కావడం కూడా సినిమాకు బాగా కలిసొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో మణి అగురియా, మౌర్య చౌదరి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు.
అయ్యయ్యో లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

