విలన్ క్యారెక్టర్ కోసం భారీ పారితోషికం !
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. మరో కీలక పాత్రను బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. మరో కీలక పాత్రను బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్తలు ఇటీవల బయటకు వచ్చాయి. ఇదే విషయంలో తాజాగా మరో అప్డేట్ తెలుస్తున్నది. ఈ చిత్రంలో కమల్ మెయిన్ విలన్‌గా ఉంటారని, కనీసం నెల రోజుల పాటు ఆయన ఈ చిత్రానికి షూటింగ్ చేస్తున్నారట. 30 రోజుల డేట్స్ కోసం కమల్ హాసన్ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవల ‘విక్రమ్’ సినిమా బ్లాక్ బస్టర్‌తో కోలీవుడ్‌లో కమల్ ఇమేజ్ బాగా పెరిగింది. ఆయన నటిస్తున్నారంటే ఆ సినిమాకు తమిళనాట బిజినెస్‌కు క్రేజ్ ఏర్పడనుంది. దీంతో కమల్ కోరినంత ఫీజు ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని తెలుస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ టైమ్ మిషిన్ సెట్‌ను హైదరాబాద్ శివారులో వేశారు. సైన్స్ ఫిక్షన్ అంశాలతో ప్రేక్షకుల్ని ఈ సినిమా మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లిన అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

