తమిళ చిత్రం ‘వినోదాయ సిత్తమ్’ చిత్రంలో అగ్ర హీరో పవన్‌కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన దేవుడి పాత్రలో కనిపించనున్నారు. సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్ ఈ రీమేక్ కోసం మూడు వారాలు మాత్రమే డేట్ప్ కేటాయించారని చెబుతున్నారు. దాంతో జూలైలో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి ఆగస్ట్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చేలా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తికి దేవుడు మరలా బతికే అవకాశం ఇస్తే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర కథాంశం.