అగ్ర కథానాయిక సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం విదేశీ విహారంలో ఉన్న ఈ భామ సోషల్‌మీడియాలో చేసిన తాజా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. నాగచైతన్యతో విడాకుల అనంతరం తన సోషల్‌మీడియా ఖాతాలో ప్రేమకు సంబంధించిన చాలా పోస్ట్‌లు చేసింది సమంత. తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘ఈ ప్రపంచంలో మనల్ని ద్వేషించి మనుషులు చాలా మంది ఉంటారు.
అలాగే మాటలతో బాధపెట్టే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఈ లోకంలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమే దొరుకుతుంది’ అంటూ ఓ కొటేషన్ షేర్ చేసింది. ఈ తాజా పోస్ట్‌తో సమంత ఎవరి ప్రేమలోనైనా పడిందా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన ‘ఖుషి’ చిత్రంలో సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.