Game Changer | ‘గేమ్‌ఛేంజర్’ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. కొడుకు పాత్ర పేరు రామ్నందన్ అని కూడా రివీల్ అయ్యింది. తాజాగా తండ్రి పాత్ర పేరు ‘అప్పన్న’ అని తెలుస్తున్నది. ఈ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని సమాచారం. అప్పన్నగా రామ్‌చరణ్ అహార్యం, అభినయం కొత్తగా ఉంటుందట. ఈ కేరక్టర్‌కి సంబంధించిన ఫొటోలు కూడా గతంలో లీక్ అయ్యాయి.
మరో విశేషం ఏంటంటే.. ఈ పాత్రకు నత్తి కూడా ఉంటుందట. ఈ సమస్యే కథలో కీలకంగా ఉంటుందట. తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నిజం చేశాడనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని తెలుస్తున్నది. ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. కీలకమైన ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, కైరా అడ్వానీ కథానాయికలు. శ్రీకాంత్, ఎస్‌జేసూర్య, సునీల్ కీలక పాత్రధారులు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.