న్యూఢిల్లీ: సూపర్‌హిట్ బాలీవుడ్ ఫిల్మ్ షోలే చిత్రం రిలీజై 50 ఏళ్లు అయ్యింది. అప్పట్లో బాక్సాఫీసు రికార్డులు తిరగరాసింది. యాక్షన్, డైలాగ్స్‌తో ఆ ఫిల్మ్ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆ ఫిల్మ్‌లో ధర్మేంద్ర, అమితాబ్, హేమామాలినీ(Hemamalini), అంజద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే డ్రీమ్‌గర్ల్ హేమామాలినీ ప్రస్తుతం లోక్‌సభలో ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. షోలే చిత్రానికి 50 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఆమె సెలబ్రేట్ చేసుకుంది. యూపీలోని మథుర నియోజకవర్గానికి చెందిన ఆ అందాల నటి ఇవాళ పార్లమెంట్ ఆవరణలో షోలే చిత్రం గురించి మాట్లాడారు.
విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. షోలే చిత్రంలో నటించడం గొప్ప అనుభూతి అని హేమామాలినీ పేర్కొన్నారు. షోలే చిత్రం కోసం పనిచేస్తున్న సమయంలో.. అప్పుడు ఆ ఫిల్మ్ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదన్నారు. ఆ రోజులు వేరు అని, ఇప్పుడు మరో షోలే చిత్రాన్ని చేయడం కష్టమే అని హేమామాలినీ తెలిపారు. షోలే చిత్రం రిలీజై 50 ఏళ్లు అవ్వడం అంటే ఓ సంతోషకరమైన మైలురాయిని దాటినట్లు ఆమె చెప్పారు. ఆ ఫిల్మ్‌లో చేసిన అనుభవం చిరకాలం గుర్తుండిపోతుందని డ్రీమ్‌గర్ల్ తెలిపింది.
VIDEO | Monsoon Session: On 50 years of movie ‘Sholay’, BJP MP from Mathura and actor Hema Malini (@dreamgirlhema) says, “I am feeling very good, we never thought it would run for 50 years, but it is one of the most wonderful experiences for all of us whoever participated in the… pic.twitter.com/HciRmFkfli
— Press Trust of India (@PTI_News) August 4, 2025