Farhana Movie | గ్లామర్ రోల్స్‌కు అతీతంగా, కేవలం నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ‘రాంబంటు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, ‘నీతాన అవన్’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమా ఐశ్వర్య రాజేష్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అమెను దృష్టిలో పెట్టుకుని కొందరు దర్శక, నిర్మాతలు కథలను సిద్ధం చేస్తున్నారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
దక్షిణాదిన బిజీయెస్ట్ యాక్టర్లలో ఐశ్వర్య ఒకరు. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు 12 సినిమాలున్నాయి. నిడివి ఎంతుంది అని ఆలోచించకుండా కేవలం తన పాత్రకున్న ప్రధాన్యత ఎలాంటిది అని అలోచించి సినిమాలను ఒప్పుకుంటుంది. కాగా ఇప్పుడు ఈ అమ్ముడు ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించబోతుంది. నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫర్హానా’ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించబోతుందట. మహిళా ప్రధానంగా సాగే ఈ సినిమా మనుషులు భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తుంది. తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.