e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home సినిమా సుస్వాగతం లాంటి ప్రేమకథ

సుస్వాగతం లాంటి ప్రేమకథ

సుస్వాగతం లాంటి ప్రేమకథ


‘మా బ్యానర్‌లో రూపొందిన 94వ చిత్రమిది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని అన్నారు ఆర్‌.బి.చౌదరి. ఆయన సమర్పణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇష్క్‌’. తేజ సజ్జా, ప్రియాప్రకాష్‌వారియర్‌ జంటగా నటిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.రాజు దర్శకుడు. ఎన్వీప్రసాద్‌, పారస్‌జైన్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 23న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు శ్రీరామ్‌వేణు మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు రాజా ‘ఎంసీఏ’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాలకు నా వద్ద పనిచేశారు. ఈ సినిమాతో అతడు దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో తేజ సజ్జా మాట్లాడుతూ ‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే హంగులన్నీ ఉంటా యి. మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌లో సినిమా చేయ డం గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ‘ట్రైలర్‌, పాటలు బాగున్నాయి. తేజకు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాలి’ అని నారా రోహిత్‌ పేర్కొన్నా రు. ఎన్వీప్రసాద్‌ మాట్లాడుతూ “సుస్వాగతం’ లాంటి ప్రేమకథా చిత్రమిది. యువతరాన్ని మెప్పించే హంగులతో సందేశాత్మకంగా సాగుతుంది. మంచి సినిమాగా అందరిని అలరిస్తుంది’ అని తెలిపారు. 29 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తిచేశామని చిత్ర దర్శకు డు అన్నారు. ఈ కా ర్యక్రమంలో సందీప్‌కిషన్‌, శ్రీవిష్ణు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సుస్వాగతం లాంటి ప్రేమకథ
సుస్వాగతం లాంటి ప్రేమకథ
సుస్వాగతం లాంటి ప్రేమకథ

ట్రెండింగ్‌

Advertisement