సముద్రఖని, ఐశ్వర్యరాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘ఇసాకపట్నం’. గ్యారీ బీహెచ్ దర్శకుడు. తమడా మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ కల్పిత సముద్రతీర పట్టణంలో నడిచే ఈ కథ అక్కడి నేరాలు, రాజకీయాలు, అధికార పోరాటాలకు అద్దం పట్టింది.
అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్లగలరనే విషయాన్ని ఈ సిరీస్‌లో చూపించామని, అనూహ్య మలుపులతో ఉత్కంఠభరితంగా సాగే సిరీస్ ఇదని దర్శకుడు గ్యారీ బీహెచ్ తెలిపారు. ఇందులో తాను ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన భారతి అనే శక్తివంతమైన మహిళగా కనిపిస్తానని ఐశ్వర్యరాజేష్ చెప్పింది. తన కెరీర్లో ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్ర ఇదని సముద్రఖని తెలిపారు.