Rishab Shetty-Vijay Devarakonda Movie | ఏడాది కిందట వచ్చిన ‘కాంతార’ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక డబ్బింగ్ సినిమాకు అది కూడా ము:ఖ పరిచయంలేని నటీనటుల సినిమాకు తెలుగులో రూ.50 కోట్ల వసూళ్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. నటుడిగా, దర్శకుడిగా రిషబ్‌శెట్టి ప్రతిభకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే రిషబ్శెట్టికి సంబంధించిన ఓ వార్త నెట్టంట తెగ వైరల్ అవుతుంది.
కాంతార-2 పూర్తవ్వగానే రిషబ్‌శెట్టి.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు గత రెండు,మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ‘లైగర్’తో కోలుకోలేని దెబ్బ తిన్ని విజయం ప్రస్తుతం ‘ఖుషీ’ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా తర్వాత విజయ్.. గౌతమ్ తిన్ననూరితో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు. ఇదే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాత విజయ్-రిషబ్‌శెట్టి సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని ఈ రూమర్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే కొంత మంది నెటీజన్లు మాత్రం ఇది పక్కా ఫేక్ న్యూస్ అని కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్‌శెట్టి కాంతార సీక్వెల్ తర్వాత హీరోగా వేరే దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని కన్నడిగులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ కూడా ప్రస్తుతం ఒప్పుకున్న రెండు ప్రాజెక్ట్‌ల తర్వాత ‘గీతాగోవిందం’ ఫేమ్ పరుశురాం పెట్ల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
మరి నిజంగా వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కుతుందా? అనేది తెలియాలంటే వీళ్ళలో ఎవరైనా స్పందించాల్సి ఉంటుంది. ఇక రిషబ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కాంతార-2 పైనే పెట్టాడు. ఈ సారి గ్లోబల్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాకుండా బడ్జెట్ కూడా మొదటి భాగానికి పది రెట్లు ఎక్కువ కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. రెండవ భాగం సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా తెరకెక్కించనున్నారు. అసలు రిషబ్ తండ్రి ఎవరు? ఆయన ఎటు వెళ్లారు? అనే నేపథ్యంలో కాంతార-2 రూపొందనుందని సమాచారం.