Vaarasudu Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారసుడు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో పర్వాలేదనిపించే కలెక్షన్లు రాబడుతున్న..
Vaarasudu Movie On OTT | దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో పర్వాలేదనిపించే కలెక్షన్లు రాబడుతున్న.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతుంది. పైగా పోటీగా ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ల వంటి మాస్ సినిమాలు ఉండటంతో తెలుగు ప్రేక్షకులు వారసుడును పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పలు తెలుగు సినిమాల రిఫరెన్స్‌లు కూడా ఈ సినిమాలో కనబడుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 10 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావడం, కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో చిత్రబృందం అమెజాన్‌తో మరో డీల్‌ను కుదుర్చుకుందట. దాంతో ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న డేట్‌ను ప్రీ పోన్ చేస్తున్నారని టాక్. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. నిజానికి ఈ సినిమా జనవరి 11నే తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మూడు రోజులు వెనక్కి జరిగింది. అయితే ముందచ్చుంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

