Sujeeth | రన్ రాజా రన్ బంపర్ హిట్టనే విషయం పక్కన పెడితే.. సుజీత్ స్క్రీన్‌ప్లేకు మాత్రం వందకు రెండోందల మార్కులు వేయోచ్చు. కథలో డీటేయిలింగ్ గానీ, ట్విస్టులు గానీ సుజీత్ రాసుకున్న విధానం వేరే లెవల్. ఇక సాహో గురించి చెప్పాలంటే ఓ పుస్తకమే రాయోచ్చు. అంత క్లియర్ కట్‌గా కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ఒక్కసారి సినిమా చూస్తే అర్థమవ్వకపోవచ్చు కానీ.. రెండు, మూడు సార్లు సినిమా చూసిన వారికి మాత్రం సుజీత్ డీటేయిలింగ్కు హ్యాట్పాఫ్ అనాల్సిందే. ఇక ఇప్పుడు అదే రేంజ్లో ఓజీ కథను కూడా రాసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. ఆయన మార్క్ ట్విస్ట్‌లు ఈ సినిమాలో బోలెడు కనిపిస్తాయట. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓజీకి సంబంధించిన ఓ వార్త వింటుంటే మాత్రం గూస్బంప్స్ వస్తున్నాయి.
సుజీత్ ఓజీ సినిమా కథను సాహో సినిమాకు లింక్ చేసుకుని రాసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా ఓజీ సినిమా సెటప్‌కు సంబంధించిన ఫోటోలు రిలీజయ్యాయి. ఆ సెటప్‌కు సంబంధించిన ఫోటోలో వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అని బోర్డ్ ఉంది. కాగా సాహో సినిమా కూడా వాజీ సిటీ చుట్టే తిరుగుతుంది. దాంతో సాహోకు ఓజీకు కనెక్షన్ ఉందా అనే సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. ఫోటోలను బట్టి ఇది నిజమే అని కచ్చితంగా చెప్పలేము. అలాగని దాన్ని కొట్టిపారేయలేం కూడా. మరి నిజంగానే సుజీత్ ఓజీని సాహోతో కనెక్ట్ చేస్తున్నాడా లేదా అనేది తెలియాల్సింది. ఒకవేళ నిజమైతే మట్టుకు ఈ సినిమా రీచ్ మాములుగా ఉండదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్‌లో అందరినీ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న సినిమా ఇదే. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది.