Shah Rukh Khan | ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న షారుఖ్‌కు ‘పఠాన్’ తిరుగులేని విజయాన్నిచ్చింది. రిలీజ్‌కు ముందు మేకర్స్ చేసిన హడావిడితో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే అనుకుంటే వరుసగా ఐదు రోజులు వంద కోట్లకు తగ్గకుంటా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. సౌత్‌లో పెద్దగా ఆడకపోయినా.. నార్త్‌లో మాత్రం సంచలనం రేపింది. ఈ సినిమా దాటికి పెద్ద పెద్ద సినిమాలు సైతం పోస్ట్ పోన్ అయ్యాయి. ప్రస్తుతం అదే జోష్‌తో షారుఖ్ జవాన్ సినిమా చేస్తున్నాడు.
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందంటూ అప్పుడే అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను ముందుగా జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్లు సమచారం. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో మేకర్స్ దాదాపు మూడు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ మీడియా నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈసినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీఖాన్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. డిజిటల్,శాటిలైట్ హక్కులు కలుపుకుని దాదాపు రూ.250 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.