Samantha | మయోసైటిస్‌తో చికిత్స తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూనే.. వాటికోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ మళ్లీ ఫిట్‌గా తయారవుతోంది. దీంతో మయోసైటిస్ నుంచి బయటపడిందని అంతా ఫిక్సయిపోయారు. కానీ మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.
మయోసైటిస్కు సంబంధించి సమంతకు ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యాధికి సంబంధించి ఐవీఐజీ ( ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ ) తీసుకుంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో వెల్లడించింది. నెలవారీ ఐవీఐజీ పార్టీ.. న్యూ నార్మల్ అంటూ రాహుల్ రవీంద్రన్, నందినీ రెడ్డితో ఉన్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఇందులో సమంత ఎక్కడా కనిపించలేదు. కేవలం సెలైన్ ఫొటో మాత్రమే కనిపించింది.
శరీరంలో బలహీనపడ్డ రోగ నిరోధక వ్యవస్థను పునరుత్తేజం చేసేందుక, ఇతర వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఈ ఐవీఐజీ థెరపీ సహాయపడుతుంది. దీనికోసం 2 నుంచి 4 గంటల వరకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమంత ఇంటి దగ్గర ఉండే ఐవీఐజీ థెరపీ తీసుకుంటుంది. దీంతో పాటు ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలని భావించినప్పటికీ సమ్మర్ సీజన్‌కు వాయిదా పడింది. ఏప్రిల్ 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇది కాకుండా రుస్సో బ్రదర్స్, రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో సామ్ పాల్గొంటున్నది.