Salaar Movie Release Date | ప్రభాస్ అభిమానులు ఏదైతే జరగొద్దనుకున్నారో అదే జరిగింది. అఫీషియల్‌గా కన్ఫార్మ్ కాలేదు కానీ దాదాపుగా డైనోసర్ రాకకు ఆలస్యం కాబోతుందని ఓపెన్ టాక్. రేపో మాపో ఓ పెద్ద నోట్ పెట్టి ఈ విషయాన్ని బహిరంగంగా చిత్ర యూనిట్ చెప్పబోతుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఆదిపురుష్ చేసిన గాయం అంతా ఇంతా కాదు. ఆ సినిమా పోతే పోయిందిలే మనకు సలార్ ఉందిలే అని వాళ్లలో వాళ్లకే సర్దిచెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవడం వాళ్లను తీవ్రంగా నిరాశ పరిచింది.
నిజానికి సలార్ సినిమా చెప్పిన డేట్‌కు పక్కా వస్తుందన్న క్లారిటీ కూడా నిర్మాతల్లో ముందుగా లేదని బెంగళూరు వర్గాల టాక్. అప్పుడే యూఎస్‌లో బుకింగ్స్ ఎందుకు ఓపెన్ చేశారని ఆయా డిస్ట్రిబ్యూటర్లపై చిరాకు కూడా పడ్డాడట. ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే.. రీ ఫండ్ చేయాలంటే పెద్ద టాస్క్ అని వాళ్లపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడట. చివరికి అనుకున్నదే జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారట. కానీ సీజి వర్క్ అంతగా సాటీస్‌ఫై అనిపించక పోవడంతో చేతులెత్తేసారట.
కాగా తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సలార్ సినిమాను నవంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసి.. పోటీ లేని డేట్‌ను చూస్తుందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. తొలి భాగాన్ని ఈ నెలాఖరులో రిలీజ్ చేసి ఆపై రెండో భాగంపై కసరత్తులు చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారట.