Sai Dharam Tej Next Movie | ‘విరూపాక్ష’ సినిమాతో తిరుగులేని విజయాన్నందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్. కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు వారాల క్రితం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఇక ఇటీవలే తమిళ, హిందీ భాషల్లో విడుదలై అక్కడ కూడా పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే సాయి ధరమ్ ప్రస్తుతం వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. కాగా తాజాగా ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అగ్ర దర్శకుడు వి.వి. వినాయక్ డైరెక్షన్ డిపార్టుమెంట్లో పనిచేసిన ఒకతను ఇటీవలే సాయి ధరమ్ తేజ్‌ను కలిసి క్రైమ్ థ్రిల్లర్ కథను చెప్పాడట. కథ బాగా నచ్చడంతో సాయి తేజ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు ఈ వార్త ప్రస్తతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక విరూపాక్ష విషయానికొస్తే.. సినిమా విడుదలై మూడు వారాలవుతున్నా ఇంకా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికే రూ.80 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిమా వంద కోట్ల మార్కును కూడా అందుకునే చాన్స్ ఉంది. పైగా పోటీగా కూడా పెద్ద సినిమాలు లేకపోవడం దీనికి కలిసి వచ్చే అంశం. ఇటీవలే రిలీజైన రామాబాణం అటకెక్కగా.. ఉగ్రం కాస్త బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది.