Eagle Movie | ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాస్‌రాజా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడనుకుంటే ‘రావణాసుర’ రూపంలో మరో ఫ్లాప్ చేరింది. ఫలితం ఎలా ఉన్న రవన్న నటనకు మాత్రం అదరగొట్టేశాడు. నెగెటీవ్ షేడ్స్ పాత్రలో క్రూరత్వాన్ని పండించాడు. ఒక్క లైన్లో చెప్పాలంటే రవితేజ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం కరెక్ట్. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ సినిమా అక్కడ విశేష ఆధరణ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక రవితేజ లైనప్‌లో ఈగల్ ఒకటి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే పోలాండ్‌లో కీలక సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎలాంటి హంగామా లేకుండా సైలెంగ్‌గా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతికి ‘ప్రాజెక్ట్-K’, ‘SSMB28’ సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఈగల్ సినిమా కూడా సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తుందట. అయితే ఈగల్ సినిమా ఈ రెండు సినిమాలకు వారం రోజుల ముందైనా, లేదంటే రెండు రోజుల తర్వాతైనా రిలీజ్ అవుతుందని టాక్.
ఇక సంక్రాంతికి రిలీజైన సినిమాలు టాక్ సంబంధంలేకుండా ఆడతాయన్నది విన్నాం.. చాలా సార్లు చూశాం కూడా. ఆ రెండు సినిమాల్లో ఒక్క దానికి నెగెటీవ్ టాక్ వచ్చినా.. ఈగల్ సినిమాకు కలిసి వస్తుంది. కంటెంట్ బాగుంటే కోట్లు వెనకేసుకోవచ్చు. ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తిక్ హాలీవుడ్ చిత్రం జాన్విక్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమ, కావ్య థాపర్ నటిస్తున్నారు. నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.