Ram Charan | విజయ్-లోకేష్ కాంబోలో తెరకెక్కుతున్న లియోపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. పైగా ఇటీవలే రిలీజైన టీజర్ సినిమాకు కావాలిసినంత బజ్ తెచ్చిపెట్టింది. విక్రమ్ తర్వాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం, ఎల్సీయూలో భాగంగానే ఈ సినిమా తెరకెక్కడం వంటివి మరింత వీర లెవల్లో అంచనాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎలాంటిదైనా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి వార్తొకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ క్యామియో ఉండనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విక్రమ్ క్లైమాక్స్ సీన్ మల్లే లియోలో కూడా ఓ క్రేజీ క్లైమాక్స్‌ను లోకేష్ డిజైన్ చేశాడట. ఈ క్లైమాక్స్‌లో పేరు మోసిన గ్యాంగ్స్టర్లందరూ లియో దగ్గరికి వచ్చే వాళ్లలో చరణ్ కూడా ఒకడిగా ఉండనున్నాడట. ఇందులో నిజమెంతుందో కానీ ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల రిలీజైన టీజర్ చివరి షాట్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన ఓ ఖరీదైన కారును చూపించారు. దాంతో అదే కారులో చరణ్ ఎంట్రీ ఉంటుందన్న వార్త మరింత బలం చేకూరుస్తుంది. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే.
నిజానికి ఈ గాసిప్‌ను నమ్మడంలోనూ పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లోకేష్ లిస్ట్‌లో చరణ్ కూడా ఉన్నాడు. పైగా చరణ్‌తో తీయబోయే సినిమా కూడా ఎల్సీయూలో భాగంగానే తెరకెక్కనుందని సమాచారం. ఈ క్రమంలో లియోలో చరణ్ గెస్ట్ రోల్ పాత్ర పోషించడం నమ్మశక్యంగానే ఉంది. ఇక లోకేష్ ఈ సినిమాను పూర్తి చేసినెంబటే ఖైదీ-2ను పట్టాలెక్కించనున్నాడు. ఆ తర్వాత విక్రమ్-2, రోలెక్స్ సినిమాలు తీయనున్నాడు.