Pushpa 3| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. . ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులోని పాటలు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. క్రికెటర్స్ సైతం ఈ సినిమాలోని బన్నీ మేనరిజమ్స్ ఇమిటేట్ చేశారు. ఇక పుష్ప చిత్రం భారీ హిట్ కావడంతో పుష్ప2ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. గతేడాది రిలీజైన పుష్ప 2 ఏకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టి ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అయితే పుష్ప 2 సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పుష్ప 3 సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2028లో పుష్ప 3 సినిమాను విడుదల చేస్తామని వెల్లడించాడు.ఇంత వరకు బాగానే ఉంది కాని బన్నీ సినిమా 2028కి రావాలంటే దీని ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా షూట్ పూర్తి చేసుకొని రిలీజ్ కావడానికి కనీసం ఏడాదైన పడుతుంది. అంటే అట్లీ బన్నీ సినిమా 2026 లోనే విడుదల అవుతుందని చెప్పాలి.
ఇక త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేసే భారీ మైథలాజికల్ సినిమా మేకింగ్ కు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 2028 లో ఆ సినిమా రావడానికి అవకాశం ఉంటుంది .ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాస్ట్‌గా లాగించిన కూడా 2027 చివరకు ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా షూట్ అయిపోయాక పుష్ప 3 మొదలు పెట్టాలి. అంటే 2029 లో లేదంటే 2030లో పుష్ప 3 ని తెర మీద చూడాలి. అయితే అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు. ముందు అయితే ఏదో ఒక సినిమాని ముందు రిలీజ్ చేయాలనే కసితో ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ముందు కానీ వెనుక కానీ వెళ్లే అవకాశం ఉంది. వేరే దర్శకులకి కూడా బన్నీ కమిటయ్యాడు. ఇవన్నీ దాటుకొని పుష్ప3 పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ అయితే బన్నీ రెడీ చేసుకోవాలి. సినీ విశ్లేషకుల ప్రకారం ఎలా చూసినా కూడా పుష్ప 3 సినిమా విడుదల కావడానికి 2030 అవుతుందని అంటున్నారు.