Bigg Boss 7 Telugu | బిగ్ బాస్ వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడా.. వాళ్లను కాపాడుతున్నాడా..?
Bigg Boss 7 Telugu | ఉన్నట్లుండి ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది.. ఆల్రెడీ 80 రోజులు అయిపోయింది కదా.. ఇప్పుడు వన్ సైడ్ గేమ్ అని ఎందుకు అనిపిస్తుంది అనుకోవచ్చు. కాకపోతే బిగ్‌బాస్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూసి వచ్చిన తర్వాత బయట కంటెస్టెంట్స్ మాట్లాడుతున్న మాటలు మాత్రం ఇవే.
Bigg Boss 7 Telugu | ఉన్నట్లుండి ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది.. ఆల్రెడీ 80 రోజులు అయిపోయింది కదా.. ఇప్పుడు వన్ సైడ్ గేమ్ అని ఎందుకు అనిపిస్తుంది అనుకోవచ్చు. కాకపోతే బిగ్‌బాస్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూసి వచ్చిన తర్వాత బయట కంటెస్టెంట్స్ మాట్లాడుతున్న మాటలు మాత్రం ఇవే. అక్కడ కొంతమందిని కాపాడటానికి గేమ్ ఆడుతున్నట్టు.. ఎలిమినేట్ అయిన వాళ్లు చెప్తున్నారు. వాళ్లను కాపాడటానికి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా మారుస్తున్నారు అని చెప్తున్నారు. ఒక వారం ఏకంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఆపుతున్నట్టు చెప్పారు వాళ్లు.
ఈ వారం అశ్విని, రతిక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. అందులో అశ్విని చేసిన కామెంట్స్ విన్న తర్వాత ఇంట్లో వన్ సైడ్ గేమ్ నడుస్తుంది అనే విషయం అర్థం అవుతుంది. ముఖ్యంగా ఇంట్లో రెండు బ్యాచ్‌లు ఉన్నాయని.. శివాజీ బ్యాచ్ ఒకటైతే, స్టార్ మా బ్యాచ్ మరొకటి అంటూ కామెంట్ చేసింది అశ్విని. ఒకరితో ఒకరికి పడటం లేదు అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే శోభా శెట్టి, ప్రియాంకలను కాపాడటానికి కొన్నిసార్లు రూల్స్ కూడా మారుస్తున్నాడు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇందులో నిజం కూడా లేకపోలేదు. రెండు వారాల కింద ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిగా ఆపేశాడు బిగ్ బాస్. ఆ వారం శోభా శెట్టి ఓట్ల లెక్కింపులో అందరికంటే తక్కువగా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆమెను కాపాడటానికి ఎలిమినేషన్ లేకుండా చేశాడు అని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే ఊపు కొనసాగితే కచ్చితంగా స్టార్ మా బ్యాచ్‌లోనే ఎవరో ఒకరు విన్నర్‌గా నిలవడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

