నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ తెలుగులో ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది ఈ భామ. దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది.ఈ క్రమంలోనే కాజల్ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్ళిచేసుకుంది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ బాటలోనే వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాజల్ తన సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు టాక్. నిషా కూడా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కాకపోతే నిషాకు అప్పటికి సినిమా అవకాశాలు అంతగాలేవు. కానీ కాజల్‌కు చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇప్పటికే అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్ట్‌లను కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాజల్ ప్రస్తుతం నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ఆచార్యలో కాజల్ పాత్రను ఎడిటింగ్‌లో కట్ చేసిన విషయం తెలిసిందే.