NTR Multistarrer | ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తరంలో మల్టీస్టారర్ సినిమాలకు యమ గిరాకీ ఉండేది. అవకాశం వస్తే చాలు ఆ కాలంలోని స్టార్లంతా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపేవారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఆ క్రేజ్ తగ్గింది. ఇక చిరంజీవి, బాలయ్యల తరం వచ్చేసరికి మల్టీస్టారర్ సినిమాలంటేనే భయపడేవాళ్లు. ఇద్దరు హీరోల్లో ఎవరిని తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ ఊరుకోరు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ రచ్చ చేస్తారని భయంతో కొన్నేళ్లు మల్టీస్టారర్ సినిమాల ఊసే లేదు. మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’తో ఆ క్రేజ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించిన రాజమౌళి తీరుకు అందరు అభినందనలు తెరిపారు. అయితే అప్పటికీ కొంత మంది తారక్ అభిమానులు మా హీరోను తక్కువ చేసి చూపించాడటంటూ రాజమౌళిని ట్రోల్ చేశారు.
ఏదేమైనా ఆర్ఆర్ఆర్తో మల్టీస్టారర్ల హవా మళ్లీ ఊపందుకుంది. భాషతో సంబంధంలేకుండా అన్ని భాషల నటీనటులు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తారక్ మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో వార్-2 కోసం తారక్ హృతిక్‌రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. అయాన్ ముఖర్జీ ఇటీవలే తారక్‌ను కలిసి కథ వినిపించాడని, విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది.
అంతేకాకుండా ఈ సినిమాలో తారక్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయని టాక్. ఈ లోపు తారక్, కొరటాల శివ సినిమాను కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ లైనప్‌లో ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. మరీ ముందుగా ఏ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.