Hanu Raghavapudi Next Movie | పదేళ్ల క్రీతం ‘అందాల రాక్షసి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు హనురాఘవపూడి. తొలి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్‌గా ఈ మూవీ అంతగా ఆడకపోయినా.. క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. ముఖ పరిచయంలేని నటీనటులతో హను ఒక పేయిన్ ఫుల్ లవ్‌స్టోరీ తెరకెక్కించి అందరిచేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని నానితో ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ సినిమా తీసి హిట్టు కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ అందమైన ప్రేమ కథలు తెరకెక్కించడంతో మరో మణిరత్నం అవుతాడు అని అందరూ అనుకున్నారు.
అయితే అనూహ్యంగా నితిన్‌తో ‘లై’ అంటూ స్పై థ్రిల్లర్ తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు. ఆ వెంటనే మళ్ళీ తన జానర్లో కొచ్చి ‘పడి పడి లేచే మనసు’ అంటూ శర్వాతో ప్రేమకథను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తగలడంతో మళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ‘సీతారామం’తో గతేడాది తిరుగులేని విజయాన్ని సాధించాడు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు సీతారామంతో వచ్చింది. గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ సినిమా కమర్షియల్గానూ భారీ వసూళ్లను సాధించింది. కాగా సినిమా వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతున్నా హను తదుపరి సినిమా ఏంటనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు.
మధ్యలో పలువురు స్టార్లతో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఓ తమిళ హీరోతో హను గ్రీన్ సిగ్నల్ చెప్పించుకున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం హను ఇటీవలే సూర్యకు ఓ కథను నెరేట్ చేశాడట. సూర్య కూడా కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించనునన్నట్లు వినికిడి.