Guntur kaaram Movie | సంక్రాంతిపై ముందుగా ఖర్చీఫ్ వేసిన సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. టైటిల్‌కు తగ్గట్లే మహేష్ బాబు మాస్ అవతారంలో ఈ సినిమాలో దర్శనమివ్వబోతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ గట్రా చూస్తేనే ఈ సినిమాలో బాబు ఏ రేంజ్లో మాస్ పండించబోతున్నాడో స్పష్టమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ మాసంలోనే షూటింగ్‌ను మొదలు పెట్టింది. కానీ ఎన్నో అవాంతరాలు ఎదురై పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మధ్యలో కథలో మార్పులు కూడా జరిగాయి.
ఇక ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ షెడ్యూల్‌కు కోంచెం గ్యాప్ ఇస్తూ షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఎట్టిపరిస్తుతుల్లో సంక్రాంతికి సినిమాను తీసుకురావాలనే కసీతోనే పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అయిటే స్టార్ కాస్టింగ్ ఉండటంతో ఆర్టిస్టుల డేట్లను సమన్వయం చేసుకోవడం చిత్ర యూనిట్‌కు పెద్ద సవాల్‌గా మారిందట. జగపతిబాబు, ప్రకాష్ రాజు, జయరాం, రమ్యకృష్ణ, సునీల్ వంటి నటులు ఇప్పుడు యమ బిజీగా ఉన్నారు. ఇక్కడనే కాదు పరభాషల్లోనూ ఈ నటీనటులు తెగ బిజీగా ఉన్నారు. ఇక హిందీ నటుడు జాన్ అబ్రహం తన సినిమాలో బిజీగా ఉన్నాడు. పూజాకు కూడా కొత్త కమిట్మెంట్లు వస్తున్నాయి. శ్రీలీల సంగతైనే ప్రత్యేకించి చెప్పడానికి ఏమి లేదు. ప్రస్తుతం ఆమె చేతిలోనే పది సినిమాలున్నాయి.
ఇక వీళ్లందరనీ సెట్స్ మీదకు తీసుకురావలంటే కత్తి మీద సామే. దాంతో షూటింగ్‌కు ఎప్పటికప్పుడు అంతరాయం కల్గుతూనే ఉంది. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని గంటల నుంచి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే చాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థుతులు చూస్తుంటే పలువురు నెటిజన్లు సైతం నిజమే అన్నట్లు అంటున్నారు. అయితే నాగవంశీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశమే రాకుండా ప్లాన్ చేసుకుంటున్నాడట. సంక్రాంతి బరిలో గుంటూరు కారంను నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నాడు.