Director Bobby | పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు ‘వాల్తేరు వీరయ్య’తో తెచ్చుకున్నాడు దర్శకుడు బాబీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. వింటేజ్ చిరు బిగ్స్క్రీన్పై కనబడటంతో మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కథ పాతదే అయినా.. కథనం ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో బాబీ వందకు వంద మార్కులు కొట్టేశాడు. మెగా ఫ్యాన్స్ చిరును ఏ విధంగా చూడాలనుకుంటున్నారో బాబీ సరిగ్గా అదే స్థాయిలో చూపించాడు. బాబీ టేకింగ్‌కు చిరు అభిమానులు ఫిదా అయ్యారు.
కాగా తాజాగా బాబీ మరో మెగా హీరోతో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా బాబీ వెల్లడించాడు. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బాబీ తన దర్శకత్వంలో నటించడానికి చిరంజీవి ఒప్పుకోవడమే తనకు పెద్ద బహుమతి అని తాజాగా తెలిపాడు. అంతేకాకుండా మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నానని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తానని ప్రకటించాడు. దీంతో ఎవరా మెగా హీరో అని ఫ్యాన్ మధ్య చర్చ జరుగుతుంది.
అయితే బాబీ ఇప్పుడు పెద్ద హీరోలతోనే సినిమాలు చేసే చాన్స్ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎలాగో ఇప్పుడు డేట్స్ ఇవ్వలేడు. ఇక రామ్‌చరణ్ ‘rc15’తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే బుచ్చిబాబు సినిమాను పట్టాలెక్కించనున్నాడు. సో రామ్‌చరణ్‌తో సినిమా చేసే చాన్స్ లేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప-2’ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. దాంతో బాబీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ అయ్యే చాన్స్ ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏ హీరోతో సినిమా చేస్తాడో.