Bhola Shankar Movie | అనుకున్న దానికంటే ఎక్కువే భోళా శంకర్ నష్టాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు పాతికోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాపై జనాల్లో ఏమంత ఆసక్తి లేదు. దానికి తోడు టీజర్, ట్రైలర్లు సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో పెద్దగా హైప్ లేకుండానే సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజే నుంచి మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుని ఫస్ట్ వీకెండ్లో చాలా వరకు థియేటర్లను ఖాళీ చేసింది. అయితే దీన్నే పనిగా పెట్టుకుని కొందరు సినిమాను తెగ ట్రోల్ చేస్తున్నారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే సినిమా అన్నాక అడటం.. ఓడటం రెండే జరుగుతాయి. దానికెందుకింత రచ్చ చేస్తున్నారనే వారు కూడా లేకపోలేరు.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి సోగ్గాడే చిన్ని నాయనాతో అక్కినేని ఫ్యాన్స్‌కు చిరకాలం గుర్తుండిపోయే సినిమానిచ్చిన కళ్యాణ్ కృష్ణ కురసాలతో చేతులు కలుపనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. శర్వానంద్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా త్రిష కూడా ఫిక్సయిపోయింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చిరు.. కళ్యాణ్‌కృష్ణ ప్లేస్‌లో మరో దర్శకుడిని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తనకు స్టాలిన్‌లాంటి సినిమానిచ్చిన ఏ.ఆర్.మురుగుదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట.
అయితే ఇందులో ఎంత వరకు నిజం లేదన్నది ఇన్సైడ్ టాక్. ఎందుకుంటే మురుగుదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వీలైనంత త్వరగానే సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్లు పూర్తవడానికి ఎంతలేదన్న ఏడాది పడుతుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి అంతకంటే ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పటివరకు చిరు సినిమా చేయకుండా ఉంటాడా అంటే.. అది కుదరని పని. ఎందుకంటే భోళా శంకర్ గాయం మానాలంటే ఎంత తొందరగా సినిమా స్టార్ట్ చేస్తే అంత బెటర్ అని నెటిజన్ల అభిప్రాయం. మరీ ఈ బేస్ లెస్ రూమర్‌పై చిరు టీమ్ స్పందిస్తుందో లేదో చూడాలి.