Chiranjeevi Next Movie | హ్యాట్రిక్ ఫ్లాప్‌ల తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు చిరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది. రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి చిరుకు తిరుగులేని విజయాన్నిందించింది. ప్రస్తుతం చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలే క్రియేట్ చేశాయి. ఈ సినిమా తర్వాత చిరు సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
దాదాపు ఈ కాంబో ఫిక్సయిందనే తెలుస్తుంది. అయితే వీళ్ల కాంబోలో తెరకెక్కే సినిమా ఓ మలయాళ రీమేక్ అని టాక్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్విరాజ్ సుకుమార్ నటిస్తూ, దర్శకత్వం వహించిన బ్రో డాడి సినిమాను రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి కాకుండా హీరోతో సహజీవనం చేస్తూ హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అదే సమయంలో హీరో తల్లి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక అప్పుడు ఆ ఫ్యామిలీలో ఎదురైన పరిస్థతులేంటి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కావాల్సినంత వినోదాన్ని పంచుతూ.. సెకండ్ ఆఫ్ ప్రీ క్లైమాక్స్‌లో సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకొని హ్యాపీ ఎండింగ్‌తో ముగుస్తుంది.
కాగా ఇదే సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజయ్యే సమయానికి పృథ్విరాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పైగా అప్పటికే ఆయన దర్శకత్వం వహించిన లూసీఫర్‌కు తెలుగులో విశేష ఆధరణ వచ్చింది. దాంతో బ్రో డాడి సినిమాను సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరి చూసేశారు. ఇక ఇప్పుడు అదే సినిమాను చిరు చేస్తున్నాడని తెలియడంతో మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక మోహన్‌లాల్ పాత్రలో చిరు నటించనుండగా.. పృథ్విరాజ్ పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.