అనుపమ పరమేశ్వరన్.. కేవలం ఆమె అందం కోసమే థియేటర్కెళ్లే అభిమానులు కోకొల్లలు. తెరపైకంటే అనుపమ ఇన్స్టాలో పెద్ద స్టార్. ఆమె ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 14 మిలియన్ల పైమాటే. అది ఆమె క్రేజ్. అనుపమలో బహుముఖప్రజ్ఞ దాగుంది. బాగా పాడుతుంది. బాగా బొమ్మలేస్తుంది. బాగా నటిస్తుంది.. అందుకే ఈ మలయాళ మందారానికి అంత క్రేజ్. దానికి తగ్గట్టే రూమర్లు కూడా బాగానే వినిపిస్తుంటాయి.
ఇటీవల ఓ రూమర్ అనుపమనే కాదు, ఆమె కుటుంబసభ్యుల్ని సైతం ఇరిటేట్ చేసింది. అదేంటంటే.. ‘ఓ టాలీవుడ్ స్టార్హీరోను అనుపమ పెళ్లాడబోతున్నది. త్వరలోనే నిశ్చితార్థం జరుగనున్నది’ ఇదీ ఆ రూమర్. దీనిపై అనుపమ తల్లి స్పందించారు. ‘ఇవన్నీ పిచ్చి మాటలు. తనకు చాలా కెరీర్ ఉంది. ఎన్నో ఆశలు కూడా ఉన్నాయి. ఆమెపై మాకూ ఎన్నో ఆకాంక్షలున్నాయి. అప్పుడే పెళ్లేంటి? తను సాధించాల్సింది చాలా ఉంది. ఇలాంటి మాటలు నమ్మకండి. అనుపమ కెరీర్ ఇప్పుడే మొదలైందని మేం భావిస్తున్నాం’ అని చెప్పారు అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీత పరమేశ్వరన్. ప్రస్తుతం ‘టిల్లూ స్కేర్’లో నటిస్తున్నది ఈ అందాలభామ.