Tom Cruise – Ana de Armas | హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొద్ది రోజులుగా హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 63 ఏండ్లు ఉన్న టామ్ 37 ఏండ్ల అనా డితో డేటింగ్లో ఉన్నట్లు హాలీవుడ్లో పలు కథనాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా, వీరిద్దరూ లండన్‌లో చేతులు పట్టుకుని కలిసి నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకురింది.
అయితే, అభిమానులు మాత్రం ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘డీపర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వార్తలపై ఇప్పటివరకు టామ్ క్రూజ్ కానీ, అనా డి అర్మాస్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వీరిద్దరూ తమ రిలేషన్‌పై మౌనం వహించడంతో ఈ పుకార్లకు మరింత ప్రాధాన్యత లభిస్తోంది.
Tom Cruise and Ana de Armas went on a weekend getaway together — and they were holding hands…does this mean they are truly together?
More pics: https://t.co/s9LFY34NLb pic.twitter.com/hB6wieNH9m
— TMZ (@TMZ) July 29, 2025