Allu Arjun Next Movie | ‘పుష్ప’తో తిరుగులేని క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో నార్త్ ఆడియెన్స్‌తో జైజైలు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
కాగా తాజాగా బన్నీ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ‘పుష్ప-2’ తర్వాత బన్నీ మళ్లీ త్రివిక్రమ్‌తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను బన్నీ హోం ప్రోడక్షన్స్ అయిన గీతా ఆర్స్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. త్రివిక్రమ్-బన్నీ కాంబోలో వచ్చిన ‘జులాయ్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురం’లో సినిమాలు ఒకదానికంటే మరొకటి భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు నాలుగోసారి చేతులు కలపనుండటంతో ప్రేక్షకుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.