శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మను చరిత్ర’. భరత్ పెదగాని దర్శకుడు. ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ కథానాయికలు. ఈ నెల 23న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రంలో ‘ఇప్పుడే పరిచయం..’ అనే పాటను కథానాయిక సంయుక్తమీనన్ విడుదల చేసింది.
గోపీసుందర్ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని చంద్రబోస్ రచించారు. ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. ప్రేమ భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: గోపీసుందర్, రచన-దర్శకత్వం: భరత్ పెదగాని.