Peddi | \టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పెద్ది ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండటంతో సినిమా పై దేశవ్యాప్తంగా మరింత హైప్ ఏర్పడింది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్‌తో అభిమానుల్లో ఆసక్తిని పెంచిన మూవీ టీమ్.. ఇప్పుడు అత్యంత కీలకమైన ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ అవైటెడ్ ట్రైలర్‌ను మే 18న ముంబై వేదికగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ట్రైలర్ లాంచ్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రైలర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా బజ్ ప్రకారం ‘పెద్ది’ ట్రైలర్ 2 నిమిషాల 35 సెకండ్ల నిడివితో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే ఆ రెండు నిమిషాలకుపైగా రామ్ చరణ్ మాస్ యాక్షన్, ఎమోషన్స్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో అభిమానులకు పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ట్రైలర్ కట్ కోసం ప్రముఖ ట్రైలర్ ఎడిటర్ నిఖిల్ నాదెళ్ల పని చేస్తున్నట్లు సమాచారం. గతంలో సాహో,ఓజీ, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు ఆయన అందించిన ట్రైలర్ కట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘పెద్ది’ ట్రైలర్‌కు కూడా అదే స్థాయి ఎలివేషన్స్ ఉండనున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుండటంతో కథ, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు అన్నీ కలిసి భారీ అనుభూతిని ఇవ్వనున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కొత్త లుక్, పాత్ర తీరు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ట్రైలర్ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సోషల్ మీడియాలో ఇప్పటికే ‘పెద్ది’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.