Drishyam 2 | దృశ్యం 2 విడుదలపై ఆసక్తికర అప్ డేట్..నిజమేనా?
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ వెంకటేశ్ ( Venkatesh) నటించిన చిత్రం దృశ్యం 2 (Drishyam 2). ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ వెంకటేశ్ ( Venkatesh) నటించిన చిత్రం దృశ్యం 2 (Drishyam 2). జీతూ జోసెఫ్ ( Jeethu Joseph) దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలయేందుకు రెడీ అవుతుండగా..డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలవుతుందా..? లేదా థియేటర్ లో రానుందా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. దృశ్యం 2ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు ప్రమోషన్స్ పై ప్రణాళిక సిద్దం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న మహా సముద్రం దసరా బరిలో ఉంది. అక్టోబర్ 14న విడుదల కానుంది. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే కాంబోలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కూడా అక్టోబర్ 8న విడుదల కానుంది. దృశ్యం 2 చిత్రం ఈ రెండు సినిమాల మధ్యలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై వెంకీ అండ్ టీం నుంచి అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది దృశ్యం 2. మీనా, కృతిక, ఎస్తేర్ అనిల్, నదియా, సంపత్ రాజ్, నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

