Prabhas – Mahesh Babu | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ షెడ్యూల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ కూడా షూటింగ్ ప్రారంభం కానుంది. వీటి తర్వాత కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ చిత్రాలు చేయనున్నాడు. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.
డార్లింగ్ మూవీస్ నుంచి పలు అప్డేట్స్ రాగా, అవి అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి. ఈ క్రమంలో, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రభాస్ సినిమా ప్రస్తావన కూడా వచ్చింది. దివంగత నటుడు కృష్ణంరాజు.. మహేష్–ప్రభాస్ కాంబోలో ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమాను చేయాలనుకున్నారట. ఆ సమయంలో డైరెక్టర్ మురగదాస్ వీరిద్దరి కోసం ప్రత్యేక స్టోరీ కూడా రెడీ చేసినట్లు టాక్. అయితే, ఇద్దరు హీరోలు ఇప్పటికే ఇతర ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండడంతో, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్ ఇప్పుడు చేస్తే పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటూ జోస్యాలు చెబుతున్నారు. ప్రభాస్- మహేష్ బాబుని ఒకే తెరపై చూస్తే ఆ కిక్కే వేరప్పా అని అంటున్నారు.
ఇక మహేష్ బాబు క్రేజ్ ఇన్నాళ్లు సౌత్ పరిశ్రమ వరకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాతో ఎల్లలు దాటడం ఖాయం. మహేష్ బాబు ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై పూర్తి క్లారిటీ లేదు. కాగా, మహేష్ బాబు–ప్రభాస్ కాంబోలో సినిమా ఎప్పుడు రూపొందుకుంటుందా అని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.