Nivetha Thomas | టాలీవుడ్లో సహజమైన నటనకు పెట్టింది పేరు నివేథా థామస్. ‘నాని జెంటిల్మన్’, ‘నిన్ను కోరి’, ‘వకీల్ సాబ్’, ’35’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ మలయాళ కుట్టి సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండకపోయినా.. అప్పుడప్పుడు పెట్టే పోస్టులు మాత్రం ఓ రేంజ్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా నివేథా తన సోషల్ మీడియా ఖాతాలో శారీలో ఒక సరికొత్త ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె లుక్ చాలా డిఫరెంట్గా, క్లాసీగా ఉంది. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే నివేథా, ఈ ఫొటోలో కూడా ట్రెడిషనల్ లుక్లో అదరగొడుతుంది. ఈ ఫొటో చూసిన అభిమానులు “అందానికే అసూయ పుట్టేలా ఉంది”, “నేచురల్ బ్యూటీ అంటే నీదే” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైకులు, షేర్లు రావడంతో ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.

Nivetha Thomas