ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఫా) వేడుకలు అబుదాబీలో జరుగుతున్నాయి. ఇక్కడి యాస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ ఎరీనా కార్యక్రమానికి వేదికైంది. ఈసారి ఐఫా వేడుకల్లో బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాలను గుర్తు చేసుకునేందుకు డ్యాన్స్ పర్పార్మెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటున్నది. పాత హిందీ సినిమా పాటలకు రెట్రో స్టెల్లో డ్యాన్సులు చేయనుంది రకుల్. ఈ కార్యక్రమంలో భాగం కావడంపై రకుల్ స్పందిస్తూ…‘ఇలాంటి పర్పార్మెన్స్ ఇంతకు ముందెప్పుడూ నేను చేయలేదు.
నేను డ్యాన్సులు చేయబోయే పాటలన్నీ 50, 60 దశకాల సినిమాలకు చెందినవి. అబుదాబి ఎంతో అందంగా ఉంది. వేడుకలు జరిగే సాయంత్రం మాకెంతో ప్రత్యేక సందర్భంగా నిలిచిపోతుంది’ అని చెప్పింది. శనివారం జరిగే ఐఫా వేడుకల్లో అభిషేక్ బచ్చన్, వికీ కౌశల్ హోస్టులుగా వ్యవహరిస్తుండగా…సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వరుణ్ ధావన్, కృతి సనన్, నోరా ఫతేహి తదితరులు వివిధ పర్పార్మెన్స్ లు చేయబోతున్నారు.