క్రాక్ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఈ దర్శకుడు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా అలరించనుందీ సినిమా. అఖండ మూవీ పూర్తి చేసిన వెంటనే గోపీచంద్ చిత్రంలో జాయిన్ కానున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. రోమాలు నిక్కపొడుచుకునేలా యాక్షన్ సన్నివేశాలను సిద్దం చేశాడట. మొత్తానికి బాలయ్యను మాస్ అవతార్ లో చూపించాలనుకుంటున్న గోపీచంద్ రౌడీయిజం టైటిల్ ఫైనల్ చేస్తే ఇక బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి ఖాయమని అనుకుంటున్నారు సినీ జనాలు.
బాలకృష్ణ 107 (NBK 107)వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాపులర్ స్టార్ హీరోయిన్ ను పేరును ఫీమేల్ లీడ్ కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలియానా, త్రిష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బాలయ్యతో రొమాన్స్ చేసే అవకాశం ఎవరు కొట్టేస్తారో చూడాలి. బాలకృష్ణ, త్రిష (Trisha) కాంబినేషన్ లో ఇప్పటికే లయన్ సినిమా వచ్చింది.
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్