ఎన్టీఆర్, బుచ్చిబాబు సినిమాకు అదిరిపోయే టైటిల్..
NTR and Buchibabu Movie | బుచ్చిబాబు మాత్రం కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే రెండో సినిమా చేస్తాను అని భీష్మించుకుని కూర్చున్నాడు.
NTR and Buchibabu Movie | ట్రిపుల్ ఆర్ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్స్ సెలక్షన్ కూడా చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని రాబోయే సినిమాల కథలు ఎంచుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. దీని గురించి చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం సమాచారం రాలేదు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత బుచ్చిబాబు కోసం చాలా మంది నిర్మాతలు క్యూ కట్టారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు తమతో సినిమా చేయాలని ఏడాదిగా ఆయనతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే రెండో సినిమా చేస్తాను అని భీష్మించుకుని కూర్చున్నాడు. ఉప్పెన చేసినప్పుడే రెండో సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో చేయాలని బుచ్చిబాబు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నాడు. నిజానికి నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ కు బుచ్చిబాబు ఒక కథ చెప్పాడు. ఆ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశాడు బుచ్చిబాబు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ పరిచయంతోనే ఎన్టీఆర్ కూడా సినిమాకు సిద్ధమయ్యాడు. ఇక కథ విషయానికి వస్తే.. 60వ దశకంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది అని తెలుస్తోంది. ఇందులో కబడ్డీ కోచ్‌గా ఎన్టీఆర్ నటించబోతున్నాడు.
దీనికి అదిరిపోయే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దీనికి పెద్ది అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లో దీనికి పెద్ది అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. మార్చిన 25న ట్రిపుల్ ఆర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా మొదలు కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
“వామ్మో ఏకంగా పది మంది దర్శకులను లైన్లో పెట్టిన ఎన్టీఆర్…”
ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు”
“ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్.. ఇందులో నిజమెంత?”
“RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?”
“జూనియర్ ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంతంటే..?”
“Alia Bhatt | ఆయనతో నటించడం థ్రిల్లింగ్‌గా ఉంది: అలియాభట్”
“పదేండ్ల క్రితం మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Buchibabu
- NTR
- peddi
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

