టాలీవుడ్లో ఎన్టీఆర్ (NTR)-కొరటాల శివ (Koratala Siva) మోస్ట్ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేందుకు సర్వం సిద్దమైంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియాభట్ (Alia Bhatt) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 (NTR30)వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ ఫిబ్రవరి మొదటి వారంలో గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాపై తొలిసారి ఓపెన్ అయింది అలియాభట్.
కొరటాల శివగారు కథ వినిపించి..నా పాత్ర గురించి చెప్పారు. ఆయన చెప్పిన స్టోరీతో చాలా ఇంప్రెస్ అయ్యా. అందుకే సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పానంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి నటించడం చాలా చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ చెప్పుకొచ్చింది అలియాభట్. మరి సిల్వర్ స్క్రీన్‌పై ఎన్టీఆర్, అలియాభట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. #NTR30 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
Alia Bhatt fan crying | నాకు గుర్తున్నావన్న అలియాభట్..ఏడ్చేసిన అభిమాని వీడియో వైరల్ |
కొరటాల శివ, ఎన్టీఆర్‌తో చేయబోతున్న రెండో సినిమా కోసం కొత్త సాంకేతిక నిపుణుల టీంతో కలిసి పనిచేయనున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఆర్ఆర్ఆర్ లోఅలియా భట్ రాంచరణ్‌కు జోడీగా నటించింది. ఎన్టీఆర్‌తో కలిసి అలియాభట్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి.