టాలీవుడ్ (Tollywood) నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ ((RRR)). ఎస్ఎస్ రాజౌమళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా అక్టోబర్ 29న ఆర్ఆర్ఆర్ టీం నుంచి భారీ సర్ప్రైజ్ ఉండబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటనే దానిపై అప్పుడే ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
ఆ ఊహాగానాల్లో ఒకటే.. ప్రముఖ హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ తో రాజమౌళి భాగస్వామ్యం కాబోతున్నాడన్నది. వార్నర్ బ్రదర్స్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ను ఇంగ్లీష్ లో విడుదల చేయబోతున్నాడని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న గాసిప్. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఆర్ఆర్ఆర్ నిర్మాతలు, హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ స్టార్ డమ్ కానీ, మార్కెట్ విషయంలో కానీ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాదంటున్నా ట్రేడ్ పండితులు.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ramcharan)కనిపించనుండగా..కొమ్రంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మెరువబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో కనిపించనుండగా..హాలీవుడ్ భామ ఒలివియా మొర్రీస్ మరో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్