సతీష్ నీనాసం హీరోగా నటిస్తూ.. వర్ధన్ నరహరి, జైష్ణవిలతో కలిసి నిర్మిస్తున్న యాక్షన్ అడ్వంచర్ ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వినోద్ దొండలే దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ 80శాతం పూర్తయింది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. రోమాంచితమయ్యే నేపథ్య సంగీతంతో హీరోని చూపించిన విధానం, కత్తులు పట్టుకొని ఊతకోత కోస్తున్న హీరో లుక్ ఈ మోషన్ పోస్టర్ హైలైట్స్ అని మేకర్స్ చెబుతున్నారు. ఫిబ్రవరి 15 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానున్నదని, సతీష్ నీనాసం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలువనున్నదని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. బి.సురేష్, అచ్యుత్‌కుమార్, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, సంపత్ మైత్రేయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: లవిత్, సంగీతం: పూర్చంద్ర తేజస్వి.