‘దక్షిణభారతంలో ఐపాప్ సంగీత సంస్కృతిని పరిచయం చేసి, దానికి పటిష్టమైన పునాది వేస్తున్న సంగీత సంస్థ ‘వైవీఆర్ఎల్’.సంగీత ప్రేమికులైన యువతరానికి ఒకేఒక గమ్యం ఈ ‘వైవీఆర్ఎల్’ ’ అని సంస్థాధినేతలు చెబుతున్నారు. తెలుగునాట ఈ సంస్థ నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ పాటలు ఇంటర్నెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని వారు తెలిపారు. ‘ఓ సెలియా’.. అంటూ సాగే తొలి పాటకు గణేశ్ క్రొవ్విది, రిక్కీ బి, ఫిరోజ్ ఇజ్రాబెల్ సంగీతం అందించగా, కావ్యా కల్యాణ్‌రామ్ ఆ పాటలో నటించింది. ఈ మెలొడీకి సంగీత ప్రియుల నుండి విశేష ఆదరణ లభిస్తున్నదనీ, తాజాగా రెండో పాటను కూడా విడుదల చేశామని.. ‘సిన్నదాని సూపులే..’ అంటూ సాగే ఈ పాటకు యాడిక్రీజ్ సంగీతం అందించగా, శ్రీసత్య, వినోద్‌కుమార్ ఎస్., సాకేత్ కొమండురి, దాసరి మేఘననాయుడు నటించారు. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని వైవీఆర్ఎల్ వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పాటలు వైవీఆర్ఎల్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు.