ఇంద్రజ, జైశ్వర్, సోనాలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘విప్లవ వీరుడు’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్. నాగరాజ్ రావు దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్‌నిచ్చారు. స్వాతంత్య్ర కాలంనాటి ఈ కథలో ఓ సామాన్యుడు విప్లవ వీరుడిగా ఎలా మారాడనే వైనాన్ని చూపిస్తున్నామని, ఇదొక వీరోచితగాథ అని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో తాను రాణి భవానీ దేవి అనే పాత్రలో నటిస్తున్నానని ఇంద్రజ చెప్పారు. టిప్పు సల్తాన్ కాలంనాటి కథ ఇదని, మంచి సందేశంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్, నిర్మాత: ఏవీ జయరాం, దర్శకత్వం: ఎస్.నాగరాజ్ రావు.