Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేకుండా వున్న ‘ఇండియన్ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు వరుస అప్డేట్లను ఇస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇండియన్-2 ఇంట్రో విడుదల చేసిన చిత్రబృందం తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేసింది.
ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు కమల్ హాసన్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రెడ్ జెయింట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మరోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్… ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Gear up for the comeback of Senapathy!🤞INDIAN-2 🇮🇳 is all set to storm in cinemas this JUNE. Mark your calendar for the epic saga! 🫡🔥#Indian2 🇮🇳
🎬 @shankarshanmugh
🎶 @anirudhofficial
📽️ @dop_ravivarman
✂️🎞️ @sreekar_prasad
🛠️ @muthurajthangvl
🌟 #Siddharth… pic.twitter.com/iOTzxSk0OR— Kamal Haasan (@ikamalhaasan) April 6, 2024