సుమన్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, సితార, మకరంద్దేశ్పాండే. అద్దంకి దయాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నది. యం.యం.కీరవాణి స్వరకర్త. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుక ఇటీవల హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు బొమ్మకు మురళి మాట్లాడుతూ..మనదేశంలో కల్చరల్ డీఎన్ఏ మీద తెరకెక్కుతున్న తొలి చిత్రమిదని, మనిషి సాంస్కృతికపరమైన పరివర్తనను ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఈ సినిమాలో గద్దర్ ఆడి పాడి నటించిన పాటకు తాను మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సుమన్, సుచిత్రా చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.