WPL 20226 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి. వరుసగా ఐదు విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నాకౌట్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కానీ, మిగతా మూడు బెర్తులకు మాత్ర గట్టి పోటీ నెలకొంది. చావోరేవో మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) పోటీలోకి వచ్చింది. మూడు విజయాలతో గుజరాత్ జెయింట్స్(Gujarat Gaints) బరిలో ఉండగా.. రెండు విజయాలకే పరిమితమైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians), యూపీ వారియర్స్ (UP Warriorz) గెలిస్తేనే ముందంజ వేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. ఏ జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయో చూద్దాం.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో ఛాంపియన్‌గా అవతరించిన ఆర్సీబీ ఈసారి కప్ కొట్టేలా కనిపిస్తోంది. వరుసగా ఐదుకు ఐదు మ్యాచుల్లో జయభేరి మోగించిన స్మృతి మంధాన బృందం దర్జాగా ప్లే ఆఫ్స్ చేరుకుంది. బ్యాటింగ్ యూనిట్లో అందరూ రాణిస్తుండడం.. లారెన్ బెల్, సయాలీ సత్ఘరేలు బంతితో చెలరేగుతుండడం ఆ జట్టును ప్రమాదకరంగా మార్చేశాయి. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఉంటే అత్యధిక పాయింట్లతో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లేది.
Setting up the game nice and early. 𝙋𝙤𝙬𝙚𝙧 𝙢𝙚𝙚𝙩𝙨 𝙥𝙤𝙞𝙨𝙚 in the powerplay. 😮💨🔥
Consistency, over after over, and keeping the standards high. ❤️🔥#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/623weP5xQF
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 21, 2026
కానీ, ఆల్‌రౌండ్ షోతో మంధాన టీమ్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. అవకాశాల్ని మెరుగుపరచుకుంది. లీగ్ దశలో జనవరి 26న ముంబై ఇండియన్స్‌తో, జనవరి 29న యూపీ వారియర్స్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా చాలు ఆర్సీబీ ఫైనల్ చేరడం ఖాయం. ఒకవేళ రెండింటా ఓడినా కూడా రన్ రేటు(+1.236)మెరుగ్గా ఉండడం ఆ జట్టుకు కలిసిరానుంది.
రెండుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈసారి అంచనాలు అందుకోలేకపోతోంది. కీలక ప్లేయర్లకు గాయాలు, టాపార్డర్ వైఫల్యం ముంబైని ముంచుతున్నాయి. తొలి పోరులో ఆఖరిదాకా పోరాడినప్పటికీ ఆర్సీబీచేతిలో కంగుతిన్నది ముంబై. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఖాతా తెరిచింది. కానీ, యూపీ వారియర్స్‌తో రెండు మ్యాచుల్లోనూ హర్మన్‌ప్రీత్ సేన ఓడింది. గుజరాత్ జెయింట్స్‌పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ శతకంతో చెలరేగడంతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది ముంబై. కానీ, ఢిల్లీ అదిరే విజయంతో ముంబైకి ఝలక్ ఇచ్చింది.
ప్రస్తుతం 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న మాజీ ఛాంపియన్.. తదుపరి రెండు మ్యాచుల్లో గెలిస్తేనే ముందంజ వేసే అవకాశముంది. జనవరి 26న ఆర్సీబీతో, జనవరి 30న గుజరాత్‌తో ముంబై ఢీకొననుంది. ఒకవేళ వీటిలో ఒక్కదాంట్లో ఓడితే 6 పాయింట్లతో రేసులోనే ఉంటుంది ముంబై. అయితే.. యూపీ, గుజరాత్ జట్లు తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించాలి. అప్పటికీ ఢిల్లీ కంటే ముంబై రన్రైటు మెరుగ్గా ఉంటేనే ప్లే ఆఫ్స్ ఛాన్సుంది.
ఆరంభంలో భారీ స్కోర్లతో రెండు విజయాలు నమోదు చేసిన గుజరాత్ జెయింట్స్ ఆ తర్వాత చతికిలపడింది. ఓపెనర్లు బేత్ మూనీ, సోఫీ డెవినెలు నిలకడలేమి.. బౌలర్లు తేలిపోతుండడం ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బతీస్తోంది. గురువారం యూపీ వారియర్స్‌పై 45 పరుగులతో గెలుపొందడం అష్లీ గార్డ్నర్ టీమ్‌కు ప్లస్ అయింది.
Spellbinding stuff from RJ. 🪄😵💫
All experience. All class.
👏#GujaratGiants #BringItOn #Adani #GameOnGujaratStrong #TATAWPL #GGWvUPW pic.twitter.com/tO1vPamuaW— Gujarat Giants (@Giant_Cricket) January 22, 2026
చివరి రెండు లీగ్ మ్యాచుల్లో గెలిస్తే గుజరాత్ ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది. అలాకాకుండా ఢిల్లీపై గెలిచి, ముంబైపై ఓడితే.. ఎనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్స్ పోరు రసవత్తరంగా మారుతుంది. అప్పుడు.. ముంబై చేతిలో ఆర్సీబీ ఓడినా.. యూపీని ఢిల్లీ మట్టికరిపించినా ఇక గుజరాత్ నెట్ రన్రేటునే నమ్ముకోవాల్సి వస్తుంది. ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోతే గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశముంది.
హ్యాట్రిక్ ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(), పేసర్లు రాణిస్తుడడంతో గాడీలో పడిన ఢిల్లీ.. శనివారం ఆర్సీబీని చిత్తుచేసి రెండో స్థానానికి ఎగబాకింది. జనవరి 27న గుజరాత్ జెయింట్స్, ఫిబ్రవరి 1న యూపీ వారియర్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఈరెండు మ్యాచుల్లో గెలిస్తే పది పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుతుంది.
Roaring into the Top 2⃣ 💙@DelhiCapitals with a dominant 7⃣-wicket win in Vadodara to jump to 2nd spot on the points table 👏
Scorecard ▶️ https://t.co/LX37VtsnbS #TATAWPL | #KhelEmotionKa | #RCBvDC pic.twitter.com/vSKMsOAqdk
— Women’s Premier League (WPL) (@wplt20) January 24, 2026
గుజరాత్ తమ చివరి లీగ్ మ్యాచుల్లో ఓడినా.. ముంబై, యూపీలను ఆర్సీబీ చిత్తు చేసినా ఢిల్లీకి ప్లస్ అవుతుంది. అప్పడు చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ చేతిలో పరాజయం పాలైనా ఢిల్లీ 8 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. అలాకాకుండా గుజరాత్ రెండు మ్యాచుల్లో గెలిస్తే.. యూపీపై ఢిల్లీ కచ్చితంగా నెగ్గాలి. అంతేకాదు యూపీ, ముంబై జట్ల పాయింట్లు 6కు మించకూడదు. ముంబై ఇండియన్స్ చివరి రెండు మ్యాచులో విజేతగా నిలిస్తే ఢిల్లీకి రన్‌రేటు కీలకం అవుతుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి నిరాశపరుస్తున్న యూపీ వారియర్స్ ఈసారి కూడా దారుణంగా ఆడుతోంది. ఢిల్లీని మూడుసార్లు ఫైనల్ చేర్చిన మేగ్ లానింగ్ సారథ్యంలోని యూపీ.. రెండే రెండు విజయాలతో అట్టడుగున ఉంది. రన్ రేటు కూడా మైనస్(-0.769)లో ఉండడం .. ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలకు గండికొట్టేలా ఉన్నాయి. తదుపరి రెండు మ్యాచుల్లో ఆ జట్టు కచ్చితంగా గెలవాలి.
Dot. Dot. Dot… 1️⃣5️⃣ dots later, Kranti bags the Green Dot Ball Award 💛#UPWarriorz #UttarDega #TATAWPL #GGvUPW pic.twitter.com/IM2NLJ0HZE
— UP Warriorz (@UPWarriorz) January 23, 2026
అదే సమయంలో ఢిల్లీ, ముంబై జట్లు చివరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోయాలి. ఈ రెండు జట్ల పాయింట్లు 6 దాటకూడదు. అప్పుడు 8 పాయింట్లు ఉంటాయి కాబట్టి.. రన్‌రేటుతో సంబంధం లేకుండా యూపీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. లేదంటే గుజరాత్ రెండు మ్యాచుల్లో ఓడి.. ముంబైపై ఆర్సీబీ గెలిచినా యూపీకి అవకాశాలుంటాయి. ఒకవేళ ముంబై చేతిలో బెంగళూరు ఓడితే.. అప్పుడు ఢిల్లీ, యూపీ 8 పాయింట్లతో రేసులో ఉంటాయి.