Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య మళ్లీ చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి సమంతతో విడాకుల అనంతరం మళ్లీ ప్రేమలో పడ్డ చైతూ శోభిళ ధూళిపాళ్ల అనే తెలుగు హీరోయిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. గురువారం వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించాడు. అయితే ఇలా మొదటి భార్యకు లేదా భర్తకు విడాకులు ఇచ్చి రెండో సారి ప్రేమలో పడిన జంటలు ఎవరు ఉన్నారో తెలుసుకుందాం.
సైప్ అలీఖాన్ (Saif Ali khan)
Saif Ali Khan
బాలీవుడ్లో ఉన్న టాప్ స్టార్లలో సైఫ్ ఒకడు. అయితే సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ని లవ్ మ్యారేజీ చేసుకున్న విషయం తెలిసిందే. తషాన్ సినిమా టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 5 ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇక సైఫ్‌కి ఇది రెండో పెళ్లి అంతకుముందు ఇతడు అమృతా సింగ్‌ను అనే బాలీవుడ్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 13 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్.
ఆమీర్ ఖాన్ (Ameer Khan)
Ameer Khan
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా పిలిపించుకునే ఆమీర్ ఖాన్ కూడా రెండు ప్రేమ వివాహాలు చేసుకున్నాడు.
తన మొదటి భార్య రీనాదత్తా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. అనంతరం 2005 లో బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. కిరణ్ రావు ఆమీర్ ఖాన్ సినిమాలకు అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేసింది ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే
వీళ్లిద్దరు కూడా 2021లో విడిపోయారు.
అర్జున్ రాంపాల్ (Arjun Rampal)
Arjun Rampal
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ (Pyaar Ishq Aur Mohabbat) అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే డెబ్యూ హీరోగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ నటుడు కూడా 24 ఏళ్లకే లవ్ మ్యారేజీ చేసుకున్నాడు. ఇండియన్ మాడల్, నిర్మాత మెహర్ జెసియాను 1998లో పెళ్లి చేసుకున్న అతడు అనుకోని కారణాల వలన 2019న విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు. జేసియాతో విడిపోయిన అనంతరం
గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ అనే అమ్మాయితో లివ్ ఇన్‌లో ఉంటున్నాడు అర్జున్. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు.
హృతిక్ రోషన్ (Hrithik Roshan)
Hrithik Roshan
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా రెండోసారి ప్రేమలో పడ్డాడు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్
సుస్సానే ఖాన్‌ను 2000లో పెళ్లి చేసుకున్న హృతిక్ 2014లో విడాకులు తీసుకున్నాడు. వీరికి హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన డివోర్స్ ప్రకటించిన చాలా ఏళ్ల అనంతరం హృతిక్ మళ్లి ప్రేమలో పడ్డాడు. బాలీవుడ్ నటి సబా అజాద్‌తో ప్రస్తుతం లివ్ ఇన్‌లో ఉంటున్నాడు.
ఫర్హాన్ అక్తర్ (Farhan Akthar)
Farhan Akthar
ఇంకా వీరే కాకుండా బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీని పెళ్లాడారు. ఆ తర్వాత 16 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పారు. అనంతరం షిబానీ దండేకర్‌తో 4 ఏళ్లు డేటింగ్లో ఉండి 2022లో రెండో పెళ్లి చేసుకున్నారు.
మలైకా అరోరా (Malaika Arora)
Malaika Arora
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకుంది. 18 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2017లో విడిపోయింది. అనంతరం మలైక బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. మరోవైపు అర్బాజ్ ఖాన్ తన మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను గతేడాది వివాహం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
Pawan Kalyan
టాలీవుడ్లో ఈ ట్రెండ్ కొంచె తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయికి విడాకులు ఇచ్చిన అనంతరం నటి రేణూ దేశయ్తో ప్రేమలో పడ్డాడు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2012లో వీడిపోయింది. అనంతరం పవన్ కళ్యాణ్ రష్యన్ నటి అన్నా లెజినోవాతో ప్రేమలో పడ్డాడు. 2013లో వీరిద్దరి పెళ్లి జరిగింది.
నాగచైతన్య
పవన్ కళ్యాణ్ తర్వాత లవ్ మ్యారేజీ చేసుకున్న సెలబ్రిటీలు అంటే నాగచైతన్య – సమంత అనే చెప్పాలి. ఏం మాయ చేసావే సినిమా సమయంలో మొదలైన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోయింది. అయితే డివోర్స్ అనంతరం నాగా చైతన్య శోభిళ ధూళిపాళ్ల అనే తెలుగు హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు. కలిసి వేకేషన్లకు వెళ్లడం, మీడియాకు చిక్కడం అన్ని జరిగాయి. అయితే ఈ జంట తాజాగా మేము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం గ్రాండ్‌గా ఏంగేజ్మెంట్ జరుపుకుంది.
Samantha Naga Chaitanya