Indian-2 Movie Shoot Footage | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇండియన్-2 ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది.
మొదటగా సంక్రాంతిని టార్గెట్ పెట్టుకున్నా.. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో విడుదల మరోసారి వాయిదా పడే చాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం షూట్ చేసిన మొత్తం ఫుటేజ్ దాదాపు 6గంటల పైనే ఉందట. దాంతో ఈ సినిమాను మూడు గంటల నిడివికి కత్తెర పని చెప్పడం కష్టతరమైనదని భావించి.. దీన్ని రెండు భాగాలుగా చేద్దామని శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. టైట్ స్క్రీన్‌ప్లేను సిద్ధం చేసి ఇండియన్-3కి హింట్ ఇస్తూ రెండో భాగాన్ని ఎడిట్ చేయనున్నారట. ఇక ఎలాగో ఆరుగంటల ఫుటేజీలో మూడు గంటలు ఇండియన్-2కు అనుకున్న మరో మూడు గంటలు మూడో భాగానికి రెడీగా ఉంటుంది.
వేస్ట్ ఫుటేజ్ అంతా తీసేసిన దాదాపు 75శాతం సీన్లు రెడీగా ఉంటాయి. ఇక ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా మరో పాతిక శాతం షూటింగ్‌ను పూర్తి చేసి రానున్న రెండేళ్లలో సినిమాను రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు తెగ కసరత్తులు చేస్తున్నట్లు చెన్నై టాక్. దీనిపై క్లారిటీ రావాలంటే మరొకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. స్వర మాంత్రికుడు రెహమాన్ స్వరాలు సమకూర్చుఉతున్నాడు.