Kamal Haasan | ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. అవినీతిని రూపు మాపడానికి ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు ఎలా నడుం బిగించాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. శంకర్ డైరెక్షన్, కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడే చాన్స్ ఉన్నట్లు తమిళ మీడియాల సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్థుతుల్లో తీసుకురావాలని ప్లాన్ చేసినా.. ప్యాచ్ వర్క్ బాగానే పెండింగ్ ఉండటంతో రిలీజ్ డేట్లో తర్జన భర్జన అవతున్నారట మేకర్స్. సంక్రాంతికి తప్పితే సమ్మర్‌కే ఈ సినిమాను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు కంపోజ్ చేస్తున్నాడు.